telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దీపావళి సందర్భంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుండి మరో పోస్టర్ ను విడుదల…

యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల “వి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయిన సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు త్వరలో మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పలాస సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో ”శ్రీదేవి సోడా సెంటర్” అనేసినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు ‘సూరిబాబు’ అనే లైటింగ్ బాయ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ తో కూడిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. తాజాగా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. సుధీర్ బాబు ఓ బెంచ్ పై కూర్చుని. గోళీసోడాలో పెట్టిన తారాజువ్వను చూస్తూ.. ఉన్నాడు. ఇక ఈ సినిమాను 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts