కామెడీ సినిమాలు చేసే అల్లరి నరేష్ నాంది సినిమాలో పక్కా సీరియస్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో నరేష్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రజాదరణ లభించింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ వార్త తెగ హల్‌చల్ అవుతుంది. ఈ సినిమాకి మొదట హీరోగా అల్లరి నరేష్‌ను అనుకోలేదట, రచయిత అనుకున్న హీరో ఈ సినిమాను తిరస్కరించడంతో ఈ సినిమా నరేష్ చేతికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాకి అందుతున్న ఆదరణ చూస్తే కచ్చితంగా ఆ హీరో తన కెరీర్‌లో ఓ గొప్ప కథను వదులుకున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరో కాదండీ తెలుగు చిత్రసీమలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు అందుకునే శర్వానంద్. అవును శర్వానందే.. ఈ సినిమాకు మొదటగా శర్వానంద్‌తో సంప్రదింపులు చేశారంట, కానీ శర్వా ఈ సినిమాపై ఆసక్తి చూపకపోవడంతో నాంది నరేష్ చెంతకు చేరిందంట. ఈ కథ విన్న నరేష్ వెంటనే ఓకే చెప్పేశారంట. ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టం అంతా ఇంత కాదు. అది మీకు సినిమా చూస్తే అర్ధం అవుతుంది.
previous post
next post