telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో రికార్డు సొంతం చేసుకున్న RRR టీజర్..

“ఆర్ఆర్ఆర్” మూవీ నుంచి విడుదలైన భీం టీజర్ తో ఎన్టీఆర్ రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ టీజర్ తాజాగా మరో రికార్డు ను తిరగరాసింది. టాలీవుడ్ లో మొదటి ఒక మిలియన్ లైక్స్ సాధించిన టీజర్ గా..లక్ష కామెంట్లు పొందిన మొదటి టీజర్ గా ఇది నిలిచింది. ఇక వేగంగా 30 మిలియన్ల వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్ గా రికార్డు సృష్టించింది. కాగా..రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 75 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. వీరిద్దరి వేరువేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ అక్టోబర్ 22 న 11:30 నిమిషాలకు రాజమౌళి విడుదల చేశారు. 

Related posts