telugu navyamedia
సినిమా వార్తలు

టీడీపీ నేతపై వర్మ ఫైర్

Ram gopal Varma Fire Censor board

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నెల 22న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయనున్నట్లు దర్శకుడు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. విడుదలను ఆపాలని దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపేలా సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారని దేవీబాబు ఫిర్యాదులో వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదల ఆపాలని దేవీబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదల అవుతుందో, బ్రేక్ పడుతుందో వేచి చూడాలి మరి.

తాజాగా ఈ విషయంపై వర్మ స్పందించాడు. ఈ విషయం తెలుసుకున్న వర్మ టీడీపీ పార్టీపై ఫైర్ అయ్యారు. ఎలాంటి ఫోర్స్ తన సినిమాను థియేటర్ లోకి రాకుండా ఆపలేదని, టీడీపీ పార్టీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను ఆపాలని ఎలెక్షన్ కమీషన్ ని సంప్రదించిందని, కానీ ఎవ్వరూ నిజాన్ని ఆపలేరంటూ ట్వీట్ చేశారు వర్మ. ఇక ఈరోజు ఉదయం “ఎన్టీఆర్ సందేశం” పేరుతో వర్మ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.

Related posts