telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సలాం నీకు పోలీసన్నా… రఘు కుంచె కొత్త పాట…

raghu

కరోనా నియంత్రణకు పోలీసుల సేవలను కొనియాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండలు పలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా నియంత్రణకు పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవకు సెల్యూట్‌ చేస్తూ టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ రఘు కుంచె తాజాగా ఓ పాటను రూపొందించారు. ‘సలాం నీకు పోలీసన్నా.. రెండు చేతులెత్తి నీకు మొక్కాలన్నా’అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. బండి సత్యం సాహిత్యం అందించగా రఘు కుంచె స్వయంగా ట్యూన్‌ కట్టి ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో ఉంటూ నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. కానీ అవసరాలకోసం బయటికొచ్చినప్పుడు, మనకోసం లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న పోలీసులను చూస్తే వారి మీద గౌరవం రెట్టింపు అవుతోంది. ప్రజల కోసం వాళ్ళు పడుతున్న తపన చూస్తే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది. అందుకే వారి కోసం.. ఈ పాట’అంటూ రఘు కుంచె పేర్కొన్నాడు.

Related posts