telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా మాట్లాడుకుంటే సమస్యలన్నీ మాయం… పూరి కొత్త పోడ్‌కాస్ట్‌

Puri

సమాజంలో ప్రజలకు ఎదురవుతోన్న, అనుభవిస్తోన్న పలు ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే పోడ్‌కాస్ట్‌లు వదిలిన పూరి.. సోమవారం మరో ముఖ్యమైన అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం చాలా మంది డిప్రెషన్‌కు ఎక్కువగా లోనవుతున్నారు. ఆ డిప్రెషన్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ‘ఏకాంత’ సూత్రం గురించి చెప్పారు పూరి. అది కూడా తనదైన శైలిలో చెప్పారు. అప్పుడప్పుడు మనతో మనం నగ్నంగా మాట్లాడుకుంటే సమస్యలన్నీ సమసిపోతాయని పూరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం.. నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. లోన్లీనె‌స్‌కి ఎలోన్‌నెస్‌కి చాలా తేడా ఉంది. ఒంటరితనం ఎప్పుడూ ఫీలవ్వద్దు. నీరసం వస్తుంది, ఏడుపొస్తుంది, మనమీద మనకే నమ్మకం పోతుంది. లైఫ్‌లో ఒకటి రెండు సార్లు నేనూ ఇలానే ఫీలయ్యాను. దాని నుండి బయటకు రావడం తెలియకపోతే ఇంకా కూరుకుపోతాం. ఎప్పుడైనా ఒంటరిగా ఫీలైనప్పుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దు. ఫ్రెండ్స్‌తో గడపండి, హెవీ సౌండ్‌తో మ్యూజిక్ వినండి, వర్కౌట్ చేయండి. ఇకపోతే, ఎలోన్‌నెస్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఏకాంతం కోసం అందరినీ వదిలేసి ఎక్కడికో పోనక్కర్లేదు. నీకున్న బంధాలు, స్నేహితులు, ప్రేమ, ద్వేషం, మతం.. అన్నీ పక్కనపెట్టి మీతో మీరు కూర్చోవాలి. మన జీవితానికి కావాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు అప్పుడే తీసుకుంటాం. మీ ఫోన్ స్విచాఫ్ చేయండి. గది తలుపు వేసేయండి. కాసేపు మీ బట్టలు విప్పి పక్కన పడేయండి. నిలువెత్తు పెద్ద అద్దం ముందు నిలుచోండి. ఆ అద్దంలో కనిపిందే వెధవని అన్ని కోణాల్లో చూడండి. వాడి పొట్ట, వాడు ఎలా ఉన్నాడో చూడండి. వాడి మీద మీకు చిరాకొస్తుందా? ముద్దొస్తున్నాడా? మీకే అర్థమవుతుంది. వాడి కళ్లలో కళ్లు పెట్టి కాసేపు వాడినే చూస్తూ ఉండండి. మీకున్న అన్ని డౌట్లు వాడిని అడగండి. వాడి విజన్ ఏంటి? వచ్చే పదేళ్ల కోసం వాడి దగ్గర ఏం ప్లాన్లు ఉన్నాయో అడగండి. లేవు అంటే మాత్రం వాడి మొహం మీద ఊసేయండి. పోనీ, వచ్చే ఏడాదికి ప్లాన్ ఏమైనా చెప్తాడేమో చూడండి. బిక్క మొహం వేస్తే అసలు వాడి సమస్యలేంటో అడగండి. వాటిని పరిష్కరించడానికి వాడి మట్టి బుర్ర పనిచేయకపోతే మీరే మంచి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలిసి వచ్చింది వాడే. పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాడిని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎంత వెధవ అయినా, దుర్మార్గుడైనా మనకు తప్పదు కదా. వారానికి ఒక్కసారైనా వాడితో కూర్చోండి. ఇద్దరూ కలిసి మంచి మ్యూజిక్ వినండి. అప్పుడప్పుడైనా ఆ అద్దంలో ఉన్న వెధవతో గడపండి.. వాడిని ప్రేమించండి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇది చేయాలి. అప్పుడప్పుడు మనతో మనం నగ్నంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే లోన్లీనెస్ అనేది డిప్రెషింగ్, డేంజరస్. ఎలోన్‌నెస్ అనేది స్పిరుచ్యువల్, గేమ్ ఛేంజర్’’ అని పూరి జగన్నాథ్ తన లేటెస్ట్ పోడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

Related posts