బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, చాకోలెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ల ప్రేమాయణం గురించి తెలిసిందే. అయితే ఈ జంట త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుండి వీరిరువురు రిలేషన్‌లో ఉండగా… వీరి పెళ్ళికి సంబంధించి మరో కొత్త డేట్ వార్తలలోకి వచ్చింది. బాలీవుడ్ సర్కిల్స్ ప్రకారం అలియా, రణ్‌బీర్‌ల నిశ్చితార్దం అక్టోబర్‌లో జరగనుండగా, వివాహం వచ్చే ఏడాది జరగనుందని అంటున్నారు. అసలు వివాహం ఇదే ఏడాదిలో జరగాల్సి ఉన్నప్పటికి, రణ్‌బీర్ తండ్రి అనారోగ్యానికి గురవ్వడం, అలియా హెల్త్ కూడా సరిగ్గా లేకపోవడంతో పెళ్ళిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారని అంటున్నారు. కాగా ఇటీవల అలియా భట్, రణ్‌భీర్ కపూర్ వెడ్డింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ జంట కెన్యాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. సఫారీ జీపులో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలని తమ కెమెరాలో బంధిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అలియా అనారోగ్యానికి గురైనట్టు పలు వార్తలు రాగా, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో కలవనుంది. ఇక అలియా, రణ్‌బీర్ కపూర్ జంటగా బ్రహ్మాస్త్రా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రణ్‌బీర్ షంషేరా అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఇందులో సంజయ్ దత్, వాణీ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
Morning is here, the day is new, perhaps this is where the light breaks through🌞
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా