telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సలార్” లో విలన్ ఫిక్స్ !

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. తాజాగా ఈ సినిమా షూటింగ్​ సింగరేణి ఆర్​జీ 3 ఓపెన్​ కాస్ట్​-2 లో ఈరోజు ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్​జీ3 పరిధిలోని 3 ఓపెన్​ కాస్ట్​-2 లో సలార్​ సినిమా షూటింగ్​ ఇటీవలే ప్రారంభించారు. బొగ్గుగని కార్మికుల నేపథ్యం ఉన్న ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు సినిమా దర్శకుడు సింగరేణిలోని ఉపరితల గనులను పరిశీలించి షూటింగ్​ను ప్రారంభించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి చేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా సలార్ విలన్‌గా మరో స్టార్ పేరు కూడా వినిపిస్తుంది. కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్‌గా చేయనున్నాడంట. కన్నడ సినీ పరిశ్రమలో మధు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు పొందాడు. అతడు కన్నడలో భారీ హిట్ అందుకున్న వజ్రకాయ, భజరంగీ సినిమాల్లో విలన్‌గా కనిపించాడు. ఇప్పుడు ప్రభాస్ స్టారర్ సినిమా సలార్‌లో కూడా చేస్తున్నాడు. అయితే అతడు సలార్ సినిమాలో చేస్తున్నట్లు స్వయంగా తెలిపారు. ‘నేను తరువాత సలార్ వెంచర్‌లో చేస్తున్నాను. ఇందులో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంద’ని మధు సోషల్ మీడియాలో స్వయంగా తెలిపారు. ఇప్పుడు మధు సలార్ సినిమాలో విలన్ పాత్ర చేయనున్నానడని వార్తలు వినిపిస్తున్నాయి. మధు కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ సినిమా ఇదే. ఈ వార్త విన్న కన్నడ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ప్రకటించే అవకాశాలు బాగానే ఉన్నాయి.

Related posts