telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తానా ఎన్నిక‌ల ఫ‌లితాలు : నిరంజన్ శృంగ‌వ‌ర‌పు ప్యానెల్ విజ‌యం..

తానా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. నిరంజన్ శృంగ‌వ‌ర‌పు ప్యానెల్ విజ‌యం సాధించింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా.. తానాకు సంబంధించి 2021-23 కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ, 2021-25 కాలానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ఎన్నికల ప్రక్రియ జరిగింది. పోటీదారులందరూ విస్తృతంగా ప్రచారం చేశారు. గత నాలుగైదు నెలల నుండి అమెరికా అంతటా అభ్యర్థులు ఎన్నికల సమరభేరి మోగించారు. తానా అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ నరేన్ కొడాలి, నిరంజన్ శృంగవరపు వర్గాల మధ్యనే పోటీ తీవ్రంగా చోటు చేసుకొంది. నాలుగైదు స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులు ఇరువైపులా రంగంలో నిలిచారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్న శృంగవరపు నిరంజన్ వర్గం ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రారంభంలో చాలా దూకుడును ప్రదర్శించింది. అనేక‌మంది సీనియ‌ర్ తానా నాయ‌కులు ఆయ‌న వ‌ర్గానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. అమెరికా అంతటా అభ్యర్థులతో పాటు తిరిగి నిరంజన్ తరఫున ప్రచారం నిర్వహించారు

Related posts