telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

మే 31 సోమవారం దినఫలాలు

మేషం : ఈ రోజు మీకు కార్యాలయంలో నూతన బాధ్యతలు అప్పగిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార, వాణిజ్యాల్లో కష్టపడి పనిచేసి నష్టాలను పూడ్చుకుంటారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. కుటుంబ ఆరోగ్యాన్ని ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోండి.

 

వృషభం : ఈ రోజు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. ఆఫీసు వాతావరణం కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇది మీకు కష్టతరంగా ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ వ్యాపారం మెరుగుపడుతుంది. రోజువారీ ఖర్చులు పెరుగుతాయి.

 

మిథునం : కుటుంబ సభ్యులతో భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో మీరు రాజీ పడాల్సి ఉంటుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. అందులో మీకు ఎలాంటి హాని లేదు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

 

కర్కాటకం : ఈ రోజు వ్యాపార రంగంలో ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. వ్యాపార భాగస్వామ్యం లాభాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుటారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. సమాజంలో మంచి విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లో సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. 

 

సింహం : ఈ రోజు మీరు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారం, పని ప్రదేశంలో మీ భాగస్వామి సలహాను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకుంటారు. సామాజిక దూరం పాటించండి. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.

 

కన్య : పైఅధికారుల సహాయంతో కార్యాలయంలో అవరోధాలను తొలగించుకుంటారు. మీ పనితో సహచరులు ప్రభావితమవుతారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుడు లేదా బంధువులు ఈ రోజు విడిపోతారు. మనస్సు చంచలంగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

 

తుల : పనిప్రదేశంలో నూతన ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకొని పని మొదలుపెడితే మంచిది. మీరు చాలాకాలంగా ఉన్న పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ వ్యాపారంలో ఒప్పందాన్ని ఖరారు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

 

వృశ్చికం : ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ రోజు శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు. ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. 

 

ధనస్సు : ఈ రోజు ధనస్సు రాశి వారు నూతన పనులు ప్రారంభించుకుంటారు. అయితే ఆరంభంలో అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపారంలో తగిన లాభం ఉంటుంది. రుణాలు తిరిగి చెల్లిస్తారు. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అధిక ఖర్చులకు దారితీస్తుంది. సాయంత్రం సమయంలో కుటుంబంతో ప్రశాంతంగా సమయాన్ని గడుపుతారు.

 

మకరం : ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వైవాహిక లేదా సామాజిక కార్యక్రమానికి హాజరుకావచ్చు. పాత స్నేహితుడిని కలవవచ్చు. రోజువారీ వ్యాపారంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఇదే సమయంలో ఖర్చులకు సాకులు ఉంటాయి. వ్యాపారంలో రుణాలు ఇవ్వడం మానుకోండి. సామాజిక దూరం పాటించండి.

 

కుంభం : రాజకీయ రంగంలో ఉన్నవారికి విజయాలుంటాయి. ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో కనిపిస్తారు. తద్వారా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ రోజు భారీగా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. భవిష్యత్తులో మంచి డబ్బును సంపాదిస్తారు. ఈ రోజు మీరు శుభకరమైన, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యకలపాలపై ఖర్చు చేయవచ్చు.

 

మీనం : ఆరోగ్యం విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కారణంగా మీరు బిజీగా సమయం గడుపుతారు. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుతారు. చాలా కాలం తర్వాత తిరిగి రుణం పొందుతారు. వ్యాపారంలో సమస్యలు అందుకుంటారు. సీనియర్ వ్యక్తితో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకుంటారు. పనిలో ఆలస్యమైతే నిరాశ చెందుతారు.

Related posts