విక్రమ్ ల్యాండర్ సంకేతాలు అందించడం మానేయడంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశకు లోనైన విషయం తెలిసిందే. ఇందులో ఊరట కలిగించే విషయం ఏమిటంటే, విక్రమ్ ల్యాండర్ ను మోసుకెళ్లిన ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. ముందు నిర్దేశించిన విధంగా ఆర్బిటర్ కాలావధి ఏడాది మాత్రమేనని, అందులో ఇప్పుడు అదనపు ఇంధనం ఉన్న దృష్ట్యా ఏడున్నరేళ్ల వరకు అది పనిచేయవచ్చని అంచనా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. ఆర్బిటర్ అందించే సమాచారం కూడా ఎంతో ఉపయుక్తమేనని భావిస్తున్నామని తెలిపారు.
శివన్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ చివరి నిమిషాల్లో తమ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. చివరి దశ తాము అనుకున్న విధంగా సాగలేదని, విక్రమ్ ల్యాండర్ తో సంబంధాల పునరుద్ధరణకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని తెలిపారు.
లవ్ స్టోరీ : ఆ సీన్ చూసి నా మైండ్ బ్లాంక్.. సమంత