telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఈఫిల్‌ టవర్‌పై … మరో సాహసోపేతమైన వినోదం.. అందుబాటులోకి ..

another thrill at eiffel tower

సందర్శకుల కోసం మరో సాహసోపేతమైన వినోదం.. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌పై అందుబాటులోకి వచ్చింది. ఈఫిల్‌ టవర్ నుంచి కిందకు 800 మీటర్ల మేర జిప్‌లైన్‌ను నిర్మించారు. ఈఫిల్‌ టవర్‌పైకి చేరుకుంటున్న సాహసికులు ఈ జిప్‌లైన్‌ నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కిందనున్న భవనంపైకి దూసుకుపోతున్నారు.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నేపథ్యంలో నెస్లీ గ్రూపునకు చెందిన మినరల్‌ వాటర్ తయారీ సంస్థ పెరియర్‌ ఈ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పెరియర్‌ ఆన్‌లైన్‌లో ఎంపిక చేసిన 260 మంది విజేతలను జిప్‌లైన్‌లో నేటి నుంచి అనుమతించనుంది.

Related posts