telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

భారీ స్థాయిలో.. ఐసీసీ ప్రపంచ కప్ … వేడుకలు..

great celebrations by icc 2019 world cup

భారీ స్థాయిలో ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2019కు ముందు సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేనంత స్థాయిలో సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో సెలబ్రేషన్స్ చేయాలని అనుకుంటున్నాం. కేవలం 3విషయాలను దృష్టిలో ఉంచుకున్నాం. ‘కనెక్టింగ్, ఎంటర్‌టైనింగ్, ఇన్‌స్పైరింగ్’ ఇవే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం’అని తెలిపాడు.

మ్యూజిక్, డ్యాన్స్, ఫుడ్ మూడు రకాలుగా సెలబ్రేషన్స్ ఉంటాయని నిర్వహకులు తెలిపారు. టోర్నమెంట్‌కు ఎప్పుడూ లేనంత స్థాయిలో మూడు మిలియన్ల వరకూ టిక్కెట్ అప్లికేషన్లు అందినట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు 4లక్షల టిక్కెట్ల అప్లికేషన్లు అందాయట. 11 స్టేడియాలలో జరగనున్న వివిధ మ్యాచ్ ల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారట. ఇందులో పాల్గొనేందుకు 4 వేల మంది అభిమానులను బ్యాలెట్‌ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు.

Related posts