ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ లో రెండో మ్యాచ్ నేడు నాగపూర్ లో జరుగుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధావన్ కు కోహ్లీ జతకలిశాడు. ధావన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 2 వికెట్ల నష్టానికి, 8 ఓవర్లలో 38 పరుగులు చేసింది.
టాస్ ఓడిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ నే ఎంచుకోవాలని అనుకున్నామని చెప్పాడు. తొలి వన్డే ఆడిన జట్టే టీమిండియా తరపున బరిలోకి దిగింది. ఆసీస్ జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు. ఈ సందర్భంగా కామెంటేటర్ గవాస్కర్ మాట్లాడుతూ, పిచ్ పై పగుళ్లు ఎక్కువగా ఉన్నాయని.. బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఉండకపోవచ్చని చెప్పారు. మ్యాచ్ కొనసాగే కొద్దీ స్పిన్నర్లకు లాభిస్తుందని అన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వారికే ప్రయోజనం ఉండవచ్చని తెలిపారు.