telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ధన్ రాజ్

Dhanraj

టాలీవుడ్ కమెడియన్ ధన్ రాజ్ ఓ షోలో భాగంగా చేసిన స్కిట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం విషయమై స్పందించిన ధన్ రాజ్ తెలుగు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. తెలుగు టీవీ షోలో పాల్గొంటున్న ధన్ రాజ్… ఓ స్కిట్ లో దీపావళి పండుగ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీప అనే అమ్మాయి, వలీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దీపావళి అనే పేరు వచ్చిందని వ్యాఖ్యానించాడు. దీనిపై ప్రేక్షకులతో పాటు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే క్షమాపణ చెప్పకపోతే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ధన్ రాజ్ క్షమాపణలు చెప్పాడు. అందరూ తనను క్షమించాలని కోరాడు. కామెడీ కోసమే అలా చేశామని… ఇంత సీరియస్ అవుతుందని తాను భావించలేదని అన్నాడు. పండుగను కించపరిచే ఆలోచన తనకు లేదని చెప్పాడు. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపాడు.

Related posts