telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి అలియా భట్ కు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…

rrr

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది. ఎందుకంటే బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అలియా.. అక్కడ దాదాపు 10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదేమంత ఎక్కువ కాదని అంతా అనుకుంటున్నా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కేవలం 10 రోజులు మాత్రమే. బాలీవుడ్ లో ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు నెలలు కాల్షీట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ పది రోజులకే 5 కోట్లు తీసుకుంటుంది. ఈ విషయంలో నిర్మాత దానయ్యకు రాజమౌళి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పారితోషకం ఎక్కువైనా పర్లేదు కానీ బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలి అంటే ఆలియా భట్ ఉండాల్సిందేనంటూ జక్కన్న కోరడంతో నిర్మాత కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఆమె అడిగినంత ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.

Related posts