telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

శబరిమలకు .. 36 ప్రత్యేక రైళ్లు .. : రైల్వే శాఖ

36 special trains to sabarimala

రైల్వే శాఖ శబరిమల యాత్రకు వెళ్లే ప్రయాణీకుల కోసం 36 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్లు హైదరాబాద్‌ – ఎర్నాకుళం – కొచ్చువేలి – హైదరాబాద్‌ మధ్యన రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. నెంబరు. 07115 హైదరాబాద్‌ – కొచ్చువేలి ప్రత్యేక రైలు జూలై, ఆగస్టు నెలల్లో ప్రతీ శనివారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరి నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి మీదగా సోమవారం వేకువజామున 3.20 గంటలకు కొచ్చువేలి చేరుకొంటుంది.

నెంబరు. 07116 కొచ్చువేలి – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు జూలై, ఆగస్టు నెలల్లో ప్రతీ సోమవారం, సెప్టెంబర్‌ 2వ తేదీన ఉదయం 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.20కి సికింద్రాబాద్‌, 2 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లకి యాత్రికులు ఎక్కువగా దిగే త్రిసూర్‌, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనూరులో నిలుపుదల సౌకర్యం కల్పించారు. వీటిల్లో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, 10 స్లీ
పర్‌క్లాస్‌ భోగీలుంటాయి.

Related posts