telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గ్రహణం నేపథ్యంలో.. శ్రీవారి దర్శనం నిలిపివేత..

TTD gold thefted will be to Tirumala today

ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఐదు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నేటి అర్ధరాత్రి దాటాక (బుధవారం వేకువజామున) 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనున్న అధికారులు.. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచి శుద్ధి చేస్తారు.

తరువాత ఆణివార ఆస్థానం పూర్తిచేసి 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు. చంద్రగ్రహణం కారణంగా నేటి సాయంత్రం నుంచి పలు ఆలయాలు మూతపడనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయాలు కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Related posts