బీజేపీ ఆకర్ష్ తో తెలుగు రాష్ట్రాలలో భారీగా చేరికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రాష్ట్రాలలో టీడీపీ మరియు కాంగ్రెస్ లేకుండా చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తద్వారా ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీకి ప్రత్యాన్మయం గా బీజేపీ మాత్రమే ఉండాలని, తద్వారా వచ్చే ఎన్నికలలో తమ గెలుపును సులభతరం చేసుకోవచ్చని ప్రయత్నిస్తుంది. ఇక బీజేపీ దెబ్బకి గోవా, కర్ణాటక, రాజస్థాన్.. రాష్ట్రాలలో అధికార పార్టీలు అల్లల్లాడుతున్న విషయం కూడా విదితమే. ఇక ఏపీ విషయానికి వస్తే, అక్కడ భారీ మెజారిటీ తో గెలిచినా వైసీపీ నుండి ఓడిన నేతలు లేకపోలేదు.. వాళ్ళని కూడా వదలకుండా బీజేపీ తమవైపు తిప్పుకుంటుంది.
తాజాగా, అధికార పార్టీ నేతలు కూడా పక్క చూపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేత ఒకరు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తోట వాణి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ సుజనా చౌదరి ద్వారా బీజేపీలో చేరేందుకు ఆమె మార్గాన్ని సుగమం చేసుకుంటున్నట్టు సమాచారం. ఏపీలో తోట వాణి బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఒకవేళ ఆమె పార్టీ మారితే ఆ నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది.
రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి.. పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారు: దేవినేని