telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనాలో కరోనా వైరస్..స్పందించిన రాహుల్

rahul gandhi to ap on 31st

చైనాలో కరోనా వైరస్ వందలాది మందిని చంపేసింది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా మందిని బయటకు రానివ్వకుండా చైనాలో ఆంక్షలు విధించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం వైరస్ బాధితులతో పాటు లక్షలాది మందిని నిర్బంధించారు. ఈ భయంకరమైన విషమ పరీక్షను ఎదుర్కొనేందుకు చైనీయులకు ధైర్యం, శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. చైనాలోని వుహాన్‌లో ప్రబలిన ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించింది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, అమెరికా, భారత్‌లో ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

Related posts