telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ వార్తలు

గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి !

corona

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీనికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పలు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతోందన్నదానిపై స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందా?లేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందగలదని స్పష్టమైంది. అయితే ఈ విషయాన్ని సీడీసీ గతంలోనూ చెప్పింది.

 

తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పెట్టి మళ్లీ తొలగించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన సీడీసీ తాజాగా మరోసారి గాలిద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు అక్కడి ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడిన తుంపర్లలో వైరస్‌ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశముంటుందని సీడీసీ వెల్లడించింది. అయితే సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పేలిపోయి, వైరస్‌ నేలపై పడిపోతుంది. అలాంటప్పుడు 6 అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్‌ సోకే అవకాశముంటుంది. 

Related posts