telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్ర బాబు ను రాజకీయంగా కేసీఆర్ దెబ్బతీయగలడా ?

Chandra Babu,KCR
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడును ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ వ్యూహం  రచిస్తున్నారు . చాలాకాలం క్రితమే చంద్ర శేఖర్ రావు  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు . తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో చంద్ర బాబు నాయుడు మహా కూటమిని ఏర్పాటు చేసి ప్రచారం  చెయ్యడం చంద్ర శేఖర్  రావు లో ఆగ్రహం తెప్పించింది . 
Shabbir Ali Sudarshan Reddy comments exit polls
వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో  చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్ర శేఖర్ రావు రవాణా శాఖా  మంత్రిగా పనిచేశాడు . 
కాలం  కర్మం  కలసి వచ్చి తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు . అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు కొన  సాగుతూనే వున్నాయి . ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి చంద్ర బాబును ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి వై సి పి అధ్యక్షుడు జగన్  మోహన్ ను కుర్చోపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు . ఈ విషయాన్ని కేసీఆర్  తనయుడు కేటీఆర్  స్వయంగా ప్రకటించాడు .  
KTR Meets YS Jagan at Lotas pond
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు మాస్టర్ ప్లాన్ తోనే  వున్నాడు  రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత  ఈ ప్లాన్ ను తన కుమారుడు ద్వారా అమలు చేస్తున్నాడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చంద్ర శేఖర్ రావు పోటీచేయబోతున్నాడు . ఆయన పార్లమెంటుకు వెళ్లి తన కుర్చీలోకేటీఆర్ ను కుర్చోపెట్టాలనేది ఆయన ఆలోచన. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ముందుకు పోతున్నాడు తెలంగాణాలో 17 పార్లమెంట్ సీట్లు వున్నాయి. అందులో ఒకటి ఎం ఐ ఎమ్ పోటీచేస్తుంది . మిగతా 16 స్థానాలను టి ఆర్ ఎస్  కైవసం చేసుకుంటుందనే ధీమాతో వున్నారు .
ఇక చాలాకాలం నుంచి ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా , పరోక్షంగా తండ్రి కొడుకులు జోక్యం  చేసుకుంటునే వున్నారు 
చంద్ర బాబును ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించి జగన్ మోహన్ రెడ్డిని కూర్చో పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. తన రాజకీయ వ్యూహంలో జగన్ మోహన్ రెడ్డిని కేసీఆర్  భాగస్వామిని చేశాడు .  ఇది తెలిసి హైద్రాబాద్లో ఆస్తులు వున్నవారిని బెదిరించి జగన పార్టీలో కేసీఆర్ చేర్పిస్తున్నాడని చంద్ర బాబు బాబు  ధ్వజమెత్తాడు . 
Wrong Affidavit Field petition KCR
దీనిపై కేటీఆర్ స్పందించాడు . అసలు వచ్చే ఎన్నికల్లో బాబు 100 శాతం ఓడిపోతున్నాడని జగన్ సీఎం అవుతున్నాడని  చెప్పి సంచలనం సృష్టించాడు ఆంధ్ర లో 25 ఎంపీ స్థానాలు వున్నాయి . జగన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా కనీసం 20 పార్లమెంట్ సీట్లు అయినా గెలుసుకునేలా తండ్రి కొడుకులు వ్యూహం రచిస్తున్నారు . ఆంధ్ర , తెలంగాలో 36 సీట్లు సంపాదిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తి కావాలనేది కేసీఆర్ మాస్టర్ ప్లాన్ . కేంద్రంలో అటు బీజేపీ కి కానీ ఇటు కాంగ్రెస్ కు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సీట్లు రావనేది కేసీఆర్ బలమైన అభిప్రాయం . 
అప్పుడుతాను  ఎవరికీ మద్దతు ఇస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చంద్ర శేఖర్ రావు నమ్ముతున్నాడు . అప్పటి పరిస్థితులను బట్టి కుదిరితే ప్రధాని లేకపోతె ఉప ప్రధాని అవుతానని కేసీఆర్  బంగారు కలతో వున్నాడు అందుకే జగన్ తో దోస్తానా చేస్తున్నాడు . తన ఫారం హౌస్ లో యజ్ఞ యాగాలను కూడా జరిపిస్తున్నారు జగన్ కు  కూడా కేసీఆర్ మద్దతు ఉంటే డబ్బుకు డబ్బు , ప్రచారం అన్నీ లాభ సాటిగా వుంటాయని , ఒకవేళ   కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పితతే 
 తనకు కూడా లాభమని జగన్ భావిస్తున్నాడు . 
kcr behind jumpings into ycp from tdp
కేసీఆర్ ప్లాన్ ను కేటీఆర్ సైలెంట్ గా అమలు చేస్తున్నాడు . నిజంగానే ఆంధ్రాలో చంద్ర బాబు నాయుడు  ఓడిపోతున్నాడా ? అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా ?  ఇటీవల కాలంలో తెలుగు దేశం నుంచి నాయకులు వైసీపీ లోకి వెడుతున్న మాట వాస్తవమే . అయితే చంద్ర బాబు గత నెల రోజుల నుంచి రైతు పథకం, పసుపు కుంకుమ, ఫించను , నిరోడీగా భృతి మొదలైన పథకాలు బాగా జనంలోకి వెళ్లాయని అంటున్నారు . గత ఎన్నికల అనుభవాలతో చంద్ర బాబు నాయుడు ఒంటరిగానే ఎన్నికలకు వెడుతున్నాడు . 
chandrababu on pavan alliance
అయితే చివరి నిముషంలో బాబుతో పవన్ కలుస్తానని , ఇప్పటికే బాబుకు పవన్ కు మధ్య ఒప్పందం కుదిరిందని సన్నిహితులు చెబుతున్నారు .  చంద్ర బాబు నాయుడు రాజకీయ అనుభవం వున్నవాడు , అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో , అందుకు ఎలాంటి వ్యూహాలు  పాటించాలో తెలిసినవాడు . అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ ను ఎలా ఇరుకున పెట్టొచ్చో బాగా తెలిసినవాడు . కేసీఆర్ ఆంధ్ర ఓటర్లను  ప్రభావితం చెయ్యడాని ప్రయత్నిస్తున్నారు ఇక  కేసీఆర్ ఊహిస్తున్న పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో లేదు . పుల్వామా పుణ్యమాని మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నాడు . జాతీయ సర్వే సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి . అయినా కేసీఆర్  తన ప్రయత్నాలు తను చేస్తూనే వున్నాడు . 
చంద్ర బాబు, కేసీఆర్  కలలోకొచ్చి  కలవరపెడుతూన్నాడేమో?
-భగీరథ

Related posts