telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో ఘోరం : కరోనా లేని 40 మందికి బ్లాక్‌ ఫంగస్‌

కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్‌ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 1179 ఉన్నాయని.. ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని తెలిపారు అధికారులు. బ్లాక్ ఫంగస్ వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని.. కోవిడ్‌ లేకున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ వస్తోందని సీఎంకు అధికారుల వెల్లడించారు. 40 మందికి కోవిడ్‌ రాకపోయినా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిందని పేర్కొన్నారు అధికారులు. డయాబెటిస్‌ ఉన్నవారికి అధికంగా వస్తోందని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి అవసరమైన ఇంజక్షన్లు, మందులు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయన్న.. మాత్రలను అవసరమైనంత మేర సిద్ధం చేసుకుంటున్నామని బదులు ఇచ్చారు. అలాగే ప్రత్యామ్నాయ ఇంజక్షన్ల కోసం కూడా కృషి చేస్తున్నామని తెలిపారు అధికారులు.

Related posts