telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం!

Chandrababu Nomination Buvaneshwari

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండగకు నారావారిపల్లెకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రతి సంక్రాంతిని స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకునే నారా కుటుంబ సభ్యులు ఈ ఏడాది మాత్ర వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అమరావతిలో రైతులు ఆందోళనలు చేపడుతున్న తరుణంలో తాను సంక్రాంతి జరుపుకోవడం సబబు కాదని చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోనే ఉండి రైతులకు సంఘీభావం ప్రకటించాలని బాబు నిర్ణయించారు. ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబసభ్యులు సందడి చేస్తుంటారు.

Related posts