telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టులో ఏపీ సర్కార్ కు మరో షాక్

ap high court

ఆంద్రప్రదేశ్  ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్టయింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ఆగస్ట్ 15వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో విశాఖలోని తిరుమలగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పట్టాల పంపిణీ వాయిదా వేసింది.

Related posts