telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కౌంటింగ్ కేంద్రాలపై .. డేగకన్ను…

drone cameras in use at counting centers

పోలీసు అధికారులు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో గగనతల నిఘాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తులు సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అనుక్షణం ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేసేందుకు డ్రోన్‌ కెమెరాలతోపాటు, సీసీ కెమెరాలను భారీ సంఖ్యలో వినియోగిస్తున్నారు.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36 కౌంటింగ్‌ కేంద్రాలు (175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఆరు కేంద్రాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆయా కేంద్రాల వద్ద 14,770 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, పరిసరాల్లో నిఘా కోసం 68 డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ఓట్ల లెక్కింపులో 25 వేలమంది సిబ్బంది పాల్గొంటున్నారు.

Related posts