telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో దూసుకుపోతున్న కరోనా.. ప్రతి 100 టెస్టుల్లో 14 పాజిటివ్!

Corona

తెలంగాణలో కరోనా వైరస్ దూసుకుపోతుంది. రాష్ట్రంలో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రతి 100 టెస్టుల్లో 14 పాజిటివ్ లు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతి 100 పరీక్షల్లో 6.11 శాతం పాజిటివ్ రేట్ ఉండగా తెలంగాణలో అది 14.39 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 28 నుంచి ఈ రేటు భారీగా పెరుగుతోంది.

ఏప్రిల్ 28 నాటికి తెలంగాణలో 5.2 శాతంగా ఉన్న టీపీఆర్ (టెస్ట్ పాజిటివ్ రేట్), ఆపై మే 14 నాటికి 6.07 శాతానికి చేరుకుంది. అనంతరం జూన్ 16కు 12.6 శాతానికి పెరిగి, ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది. ఇటీవల టెస్టుల సంఖ్యను మరింతగా పెంచడంతో భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో టెస్టులు, పాజిటివ్ లను పరిశీలిస్తే, 16న 1,251 టెస్టులు జరుగగా, 213 కేసులు వచ్చాయి.

Related posts