telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లంచం తీసుకోము .. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు…

collectors swear on no corruption

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి నిర్మూలనకు వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 15 మండలాల రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, సర్పంచులతో లంచాలు తీసుకోబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు, పిల్లలపై ఒట్టు వేసి మరీ ఈ ప్రతిజ్ఞ చేయించడం విశేషం. తొలుత కలెక్టర్ రొనాల్డ్, ప్రత్యేక అధికారి క్రాంతి, ఇతర అధికారులు ప్రమాణం చేశారు. అనంతరం అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులు, సర్పంచులతో వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ప్రమాణ పత్రాలపై ఉద్యోగుల సంతకాలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు దైవ సాక్షిగా అని ప్రమాణం ప్రారంభించగా కలెక్టర్ జోక్యం చేసుకుని పిల్లలు, తల్లిదండ్రులపై ప్రమాణం చేయాలని సూచించారు. దేవుడిపై ప్రమాణం చేస్తే చేసిన తప్పును కడిగేసుకునే ప్రయత్నం చేస్తారని, కాబట్టి పిల్లలపై ప్రమాణం చేయాలని చెబుతూ స్వయంగా ఆయన తన పిల్లలపై ప్రమాణం చేశారు. ప్రత్యేక అధికారి క్రాంతి తన తల్లిదండ్రులపై ప్రమాణం చేయగా, మిగతా ఉద్యోగులు వారిని అనుసరించారు.

Related posts