2020లో జరిగిన క్రైమ్‌కు సంబంధించి రివ్యూను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. దాని ప్రకారం గతేడాదితో పోలీస్తే.. ఈ ఏడాది 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని పోలీసులు తెలిపారు. దోపిడీలు, దొంగతనాలు కేసుల్లో 53 శాతం రికవరీ అయ్యాయి. మహిళలపై వేధింపులు కేసులు 11 శాతం పెరిగిందన్నారు. రాచకొండలో మానవ అక్రమ రవాణా 41 కేసులు నమోదవ్వగా… ఎక్స్సైజ్ కేసులు 202, అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు కేసులు 105 నమోదు అయ్యాయని పేర్కొన్నారు. నేరస్తుల శిక్షలు 2019 లో 35 శాతం ఉండగా.. 2020 లో 51 శాతంకు పెరిగింది. అలాగే సైబర్ క్రైమ్ 704 కేసులు నమోదవగా… సోషల్ మీడియా కేసులు 49,026 నమోదయ్యాయి. అలాగే… ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11 892 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డయల్ 100 కి 1,66,181 ఫిర్యాదులు వచ్చాయని…డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులు ద్వారా 41 మందిని కాపాడమని పేర్కొన్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెందిన కేసులు 892 అని… 5 కోట్ల 95 లక్షల ఆస్తి రీకవరి కేసులు ఛేదించామన్నారు. ఇక మిస్సింగ్ కేసుల్లో ఈ ఏడాది 2,525 కేసులు నమోదు కాగా… 2233 కేసులు ఛేదించామని పేర్కొన్నారు. ఈ ఏడాది గుర్తు తెలియని 89 మృతదేహాలు గుర్తించమన్నారు.
previous post