telugu navyamedia
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో బైకర్స్ వీరంగం..అడ్డుకొన్న వారి ఇంట్లోకి దూరి మరీమ‌రీ దాడి..

హైద‌రాబాద్ నగరంలోని కొంద‌రు యువ‌కులు అర్ధరాత్రుళ్లు బైకుల‌తో రోడ్డెక్కి వీరంగం సృష్టిస్తున్నారు. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ చెక్‌పోస్టులు పెట్టినా, విస్తృత వాహ‌న త‌నిఖీలు చేస్తున్న‌ప్ప‌టికీ యువ‌త‌లో మార్పులు రావ‌డం లేదు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఇటువంటి ర్యాష్ డ్రైవింగ్ ఘ‌ట‌ల‌ను ఈమ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

తాజాగా హైద‌రాబాద్ పాతబస్తీ కాలాపత్తర్‌లో రాత్రిపూట బైకర్స్‌ వీరంగం సృష్టించారు. కాలనీలో బైక్‌లతో యువత ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హంగామా చేశారు. అడ్డుకున్న ఓ యువకుడిని బైకర్స్ చితకబాదారు. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Related posts