telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నటించాలనుకుంటే మీకు సినిమా ఆఫర్ .. సమయం లేదన్న కేటీఆర్!

ktr trs

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎంతో మంది తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొస్తుంటారు. ఆయన కూడా సకాలంలో స్పందించి వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటుంటారు. అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు.

తాజాగా ఓ నెటిజన్ నుంచి కేటీఆర్ కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒక వేళ సినిమాల్లో నటించానుకుంటే… ఎలాంటి సినిమాలో నటిస్తారు? మీరు నటించాలనుకుంటే సినిమా అవకాశం ఇస్తామని ఓ నెటిజన్ అన్నారు. దీనికి సమాధానంగా సదరు నెటిజన్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఫుల్ టైమ్ జాబ్ ఉందని, సినమాల్లో నటించేంత సమయం తనకు లేదని ఆయన పేర్కొన్నారు.

Related posts