ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ, వైసీపీ మధ్య వివాదం ఉంది అనే విషయం అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో అది మరింత ముదురుతుంది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ నుంచి నోటీసులు అందాయి.. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని.. విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల సందర్బంగా తనను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ ఆదేశాలపై ప్రివిలేజ్ కమిటీకి మంత్రి పెద్దిరెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. ఇక, నోటీసుల జారీతో సెలవుపై వెళ్లేందుకు సిద్ధమైన నిమ్మగడ్డకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.. ఈ నెల 19 నుంచి 22 వరకు సెలవుపై వెళ్లేందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అయితే చూడాలి మరి మయ్హసివీలో ఇంకా ఎం జరగనుంది అనేది.
previous post
next post
అత్తింటివారిపై లాలూ కోడలు సంచలన వ్యాఖ్యలు