ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు.
‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పాముని పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.
ప్రొసీజర్ ఫాలో అయితే జగన్ ప్రశ్నిస్తున్నారు: యనమల