telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆర్బీకే లక్ష్యం అదే : జగన్

ఈరోజు ఏపీ సీఎం జగన్ రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఛానెల్‌ ను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ… ఈ రోజు ఆర్బీకేల ఘట్టంలో ఇంకో ముందడుగు వేశాం. ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ రైతు భరోసా కేంద్రం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్ధ ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. ఆ తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) అని అన్నారు. ఆర్బీకేల్లో విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు. వాటిని గ్రామాలలో రైతులు ఆర్డర్‌ ప్లేస్‌ చేసిన  48 నుంచి 72 గంటల్లోగా అందుబాటులోకి తేవడమే లక్ష్యం. ఇదే ఆర్బీకేల పరిధిలో ఏయే పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ఏమిటి అనేది డిస్‌ ప్లే చేసిన పోస్టర్‌  ఉండాలి. ఏ రైతు ఆ రేట్ల కన్నా తక్కువకు పంట అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్ధితి  ఉండకూడదు. ఏదైనా పంట అమ్ముకోలేని పరిస్ధితి ఉంటే మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకోవాలి. ఇవాళ ఆర్బీకేల పరిధిలోకి తీసుకొచ్చే అంశాలలో చాలా అడుగులు ముందుకు వేస్తున్నాం అని అన్నారు జగన్.

Related posts