telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఈ మహిళ తన భర్తను కట్టేసి… ఏకంగా దాన్నే…!?

Women

అమెరికాలోని కరోలినాలో ఓ మహిళ తన భర్తను తాడుతో కట్టేసి అతడి పురుషాంగాన్ని కోసేసిన అమానుష ఘటన చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలోని న్యూపోర్ట్‌లో నివాసముండే విక్టోరియా ఫ్రాబట్ అనే మహిళ గత కొంతకాలంగా భర్త జేమ్స్ ఫ్రాబట్ (61) పట్ల తీవ్ర అసహనంతో ఉంది. ఈ క్రమంలో సోమవారం భార్యభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన విక్టోరియా భర్త నిద్రపోయిన తరువాత అతడ్ని తాడుతో కట్టేసింది. అనంతరం కత్తితో అతడి పురుషాంగాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసింది. ఆ తరువాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ చేసి తాను చేసిన నిర్వాకం గురించి చెప్పింది. విక్టోరియా సమాచారంతో వెంటనే కార్టరెట్ కౌంటీ పోలీసులు ఆమె ఇంటికి వచ్చారు. రక్తపుమడుగులో పడి ఉన్న వృద్ధుడు… పక్కనే ముక్కలు ముక్కలు చేయబడిన అతడి శరీర భాగం పడి ఉండడం చూసి షాకయ్యారు. తెగిపడిన శరీర భాగాన్ని తీసుకొని వెంటనే వృద్ధుడిని చికిత్స కోసం విడంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. విక్టోరియాను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కార్టరెట్ కౌంటీ పోలీస్ అధికారి జాసన్ వాంక్ తెలిపారు.

Related posts