అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసిన నాగ చౌతన్య, శేఖర్ కమ్ముల.. ఆ ప్రపోజల్ ఆమె ముందుంచారట. దీంతో సాయి పల్లవికి కూడా ఇంట్రెస్ట్ కలిగి వెంటనే ఓకే అనేసిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎలాంటి డాన్స్ అయినా అలవోకగా చేయగలిగే సత్తా సాయి పల్లవిది. ఆ నమ్మకం తోనే ‘లవ్ స్టోరీ’లో ఓ పాట కొరియోగ్రఫీ బాధ్యతలను ఆమె భుజాలపై వేశారట. ఈ సినిమాకు సంబంధించి మరో రెండు వారాల షూటింగ్ పెండింగ్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను కూడా చిత్రీకరించాల్సి ఉంది. ఇదే పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేయడమే కాకుండా.. నాగ చైతన్యకు కూడా సూచనలిస్తూ ఆయనతో చిందులేయనుందట. మరికొద్ది రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.
previous post