telugu navyamedia
సినిమా వార్తలు

నిఖిల్ కార్తికేయ 2 విడుద‌ల ..ఫ్యాన్స్​కు విజువల్​ ట్రీట్

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా న‌టిస్తోంది​. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మించారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది.దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘కార్తికేయ 2’పై హైప్‌ క్రియేట్‌ అయింది.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ అంచనాల న‌డుమ‌ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది.సోషల్​మీడియాలో పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తోంది.

ఈ నేపథ్యంలో మూవీటీమ్​ తాజాగా విడుదల చేసిన మేకింగ్ విజువల్స్ ను. ద్వారకతోపాటు కశ్మీర్​లోని అత్యంత కఠినమైన ప్రదేశాల్లో జరిపిన చిత్రీకరణ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.

Related posts