telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఇలాంటి భాష… ఎవరికీ మంచిది కాదు..కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

*కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌
*అద్దంకి ద‌యాక‌ర్ వ్యాఖ్య‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ
కోమ‌టిరెడ్డికి బేష‌ర‌తూ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా..
*ఇలాంటి భాష… ఎవరికీ మంచిది కాదు

*క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌పై చర్యలు

*కోమిటిరెడ్డి అంటే మాకు గౌర‌వం ఉంది

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పారు. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలకు రేవంత్‌ బహిరంగంగా క్షమాపణ కోరారు. .

మునుగోడు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్… మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడటంతో వారంతో మనస్తాపానికి గురయ్యారు. వారి పీసీసీ అధ్యక్షుడిగా న‌న్ను సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

దీంతో ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు.క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌పై చర్యలు ఉంటాయన్నారు

తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదని, తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చెన్నారెడ్డికి రేవంత్ సూచ‌న చేయ‌డం జ‌రుగుతుంద‌ని రేవంత్ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.

ఇక, ఈ రోజు నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనుంది. ఇందుకు కొన్ని గంటల ముందు వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. మరి రేవంత్ క్షమాపణపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Related posts