telugu navyamedia
తెలంగాణ వార్తలు

అద్దంకిని శాశ్వతంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తేనే..రేవంత్ క్ష‌మాప‌ణ‌కు స్పందిస్తా..

*అద్దంకిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తేనే..
మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటా..

*అద్దంకిని శాశ్వ‌తంగా స‌స్పెండ్ చేయాలి

* రేవంత్‌రెడ్డి మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు చేప్పినా వెన‌క్కి త‌గ్గ‌ని వెంక‌ట‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు .వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు. 

అయినా మరోసారి ఆయన షరతు విధించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం సంతోషమే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ఉద్యమ కారుడినైన తనను అవమానించారన్నారు. తనపై పరుష పదజాలం వాడిన అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. 

అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్‌ క్షమాపణపై స్పందిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి క్షమాపణ మీడియా ద్వారానే తెలిసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

 

 

 

Related posts