ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఫిలింగనర్ లో విశ్వనాథ్ నివాసానికి ఈరోజు ఆయన వెళ్లారు. . అయితే, విశ్వనాథ్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఆయన్ని కలిసేందుకు కేసీఆర్ వెళ్లారన్న వదంతులు వ్యాపించాయి.
ఈ నేపథ్యంలో విశ్వనాథ్ స్పందించారు. ఈ వదంతులను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెబుతూ ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. కేసీఆర్ తన వ్యక్తిగత పనుల నిమిత్తమే విశ్వనాథ్ ను కలిసినట్టు తెలుస్తోంది.కేసీఆర్ వెంట టీఆర్ఎస్ నేతలు ఉన్నారు