హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 745 ప్రభుత్వ ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్న పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వాటిలో అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు చేపట్టవలసిన తక్షణ చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఒక సమావేశంలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. మీ మీ పరిధిలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి ఫర్నిచర్, క్రీడా సామగ్రి,ప్రహారీ గోడలు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి సమస్యలను గుర్తించి నివేదికలను రూపొందించాలని డిప్యూటీ డీఈవోలను ఆదేశించారు. నివేదికలు తయారుచేసి సమర్పిస్తే ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
మోదీతో రాజీనామా చేయించాలని వాజ్‌పేయి భావించారు: యశ్వంత్ సిన్హా