telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు: మాజీ ఎంపీ వివేక్‌

Ex-MP-Gaddam-Vivek

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై బిజెపినేత, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ స్పందించారు. ఆర్టీసీనీ ప్రైవేట్ పరం చేసేందుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ నియంత పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం జరిగేపోరాటానికి ప్రజలు కూడా మద్దతు తెలపాలని వివేక్‌కోరారు. ఆర్టీసీ కార్మికులుచేసే పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడం వల్ల ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆతమహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

Related posts