telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆదిలాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం…ఒకరు మృతి

తెలంగాణాను అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. లాక్ డౌన్ ప్రకటించిన నుంచి ఈ ప్రమాదాలు ఎక్కువగా కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని భీంపూర్ మండలం తాంసికే వద్దనున్న క్యాంపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. దీంతో స్థానికులు ఫైర్‌ ఇంజన్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్‌ చేరుకుంది. అప్పటికే రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్, రెండు బైక్ లు దగ్దం కాగా…మంటల్లో ఒక్కరిద్దరు చిక్కుకొని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు మంటల్లో ఒకరు సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో 5 లారీలు, ప్రొక్లైనర్ లకు మంటలు అంటుకున్నాయి. ఫైర్‌ ఇంజన్‌ సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Related posts