telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమల డిక్లరేషన్ అంశంపై స్పందించిన సోము వీర్రాజు

Somu-Veerraju bjp

తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు ఇకపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. టీటీడీ బోర్డు చైర్మన్ వెలువరించిన అంశాన్ని బీజేపీ ఖండిస్తోందని తెలిపారు.

స్వర్గీయ అబ్దుల్ కలాం అంతటి వ్యక్తి తిరుమల వచ్చినప్పుడు అక్కడున్న రిజిస్టర్ లో సంతకం పెట్టి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం జరిగిందని వివరించారు. ఇది యావత్ భారతదేశంలో అన్యమతస్తులకు వర్తించే అంశమని పేర్కొన్నారు. దీన్ని గమనించి ప్రకటన చేయాల్సిన సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివాదాస్పద రీతిలో ప్రస్తావించడం ఆయన అనాలోచిత వైఖరికి నిదర్శనమని అన్నారు.

Related posts