telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు!

vijayashanthi

హైదరాబాదు నగరంలోని నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో ఉన్న ఈస్ట్‌ దీనదయాళ్‌నగర్ ఉన్న నాలాలో పడి శుక్రవారం సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆమె ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయారన్నారు.

కేసీఆర్ గారూ మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పండని ప్రశ్నించారు. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజీలు, నాలాలు, మ్యాన్ హోల్స్ లో నీరు నిండి ఎన్నో ప్రమాదాలు జరుగుయాతున్నాయని అన్నారు.

ఇప్పటివరకు ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్క తీస్తే గిన్నిస్ రికార్డు అవుతుందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని మాటలు చెప్పడం మామూలైపోయిందని దుయ్యబట్టారు. .

Related posts