telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

లోన్ యాప్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి…

late salaries lead to unpaid loans

తెలంగాణలో కలకలం రేపిన లోన్ యాప్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోన్ యాప్స్ కంపెనీలపై మరింత పురోగతి సాధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. లోన్ యాప్స్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి నిధులు సమీకరించారనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.  ఇప్పటివరకు దాదాపు 25 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చారనే కోణంలో పరిశీలిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, దిల్లీలోని స్థానికులను ఉద్యోగులుగా నియమించుకుని కంపెనీలు ప్రారంభించినట్లు గుర్తించారు. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ కంపెనీలను చైనీయులు తమ వెబ్ సైట్లకు అనుసంధానం చేసుకున్నట్లు వెల్లడించారు. రుణ యాప్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని హవాలా మార్గంలో హాంగ్ కాంగ్, చైనాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కాగా,ఈ  యాప్‌ల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిర్వాహకులకు సంబంధించిన ఖాతాల్లోని సుమారు.. 400 కోట్లను సైబర్ క్రైమ్‌ పోలీసులు స్తంభింపజేశారు. ఈ దందా వెనుక చైనీయుల లింక్ బయటికి తియ్యడానికి పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. చుడాలిమరి ఇంకా ఏ ఏ విషయాలు బయాటపడుతాయి అనేది.

Related posts