వ్యవసాయ అనుబంధ విభాగాల్లో ఏపీ ముందుకు దూసుకుపోతోందని టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు అన్నారు. అలాగే ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. రిజర్వు బ్యాంకు సహకరించకున్నా ఏపీ ప్రభుత్వం 60 లక్షల మంది రైతులకు రూ.24,000 కోట్ల రుణమాఫి చేసిందని వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏటా రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తోందని ఆయన తెలిపారు. భారత్ 6.9 అభివృద్ధిని నమోదుచేస్తే, ఏపీ 11.5 శాతం అభివృద్ధిని నమోదుచేసిందని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగాన్నినాశనం చేసిందని మండిపడ్డారు. ఏపీలో రైతుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.