telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మెట్రో రైల్లో జీ5 యాప్‌ ద్వారా సేవలు..

metro train hyd

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రయాణ సమయంలో వినోదం కోసం జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జీ5 యాప్‌ ద్వారా మెట్రో సర్వీసుల్లో నచ్చిన గేమ్‌లు, సినిమాలను వీక్షించే వెసులుబాటు కల్పిస్తోంది. మంగళవారం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు ప్రయాణికులు తమ ఫోన్‌లోని డేటాను వినియోగించాల్సిన అవసరం లేదు.

మెట్రో సంస్థనే ప్రత్యేక వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎల్బీనగర్‌ నుంచి లింగంపల్లి, నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు ప్రయాణించే ప్రయాణికులంతా ఈ సేవల అందుబాటులో ఉంటాయి. దశలవారిగా అన్ని స్టేషన్లకు ఈ సేవలు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts