telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. సోమ, మంగళ వారాల్లో మోస్తరు వర్షాలు..

హైదరాబాద్ లో గ‌త నెల‌ల రోజులుగా వరణుడు నగరవాసులన్ని వణికించేస్తున్నాడు. సోమ, మంగళవారాల్లోతెలంగాణరాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఛతీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి.. కొమరిన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని చెప్పారు. రుతుపవనాల సాధారణంగానే ఉన్నా వర్షాలు మాత్రం కురుస్తాయని పేర్కొన్నారు.

నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజగుట్ట, అమీర్‌పేట్‌, మాదాపూర్‌, జీడిమెట్ల, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మారేపల్లి, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అదే విధంగా హబ్సిగూడ, ఓయూ, నాచారం, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, తార్నాక, కుత్బుల్లాపూర్‌, సురారం, చింతల్‌, గాజుల రామారం, కొంపల్లి బహూదూర్‌ పల్లి, షాపూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది

Related posts