telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు!

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడనున్నట్లు తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి.

నైరుతి రుతుపవనాలు బలం పుంజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో తరుచూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో సాధారణస్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఆదివారంకల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related posts